మంగ్లీ వివాదంలో ట్విస్ట్.. దర్శకుడు పబ్లిక్ నోట్ రిలీజ్ !

కలం, వెబ్ డెస్క్: మైక్రో ఫైనాన్స్ పేరుతో ప్రముఖ సింగర్ మంగ్లీ (Singer Mangli), ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఊడుగుల (Venu Udugula ) రూ. 150 మంది నుంచి రూ. 10 కోట్లు వసూలు చేసి ఇప్పుడు పరారయ్యారని సుబ్బారావు అనే న్యాయవాది పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు చేసినట్లు ఓ వార్త వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల స్పందించారు. తన పేరు మంగ్లీ కేసులో అనుసంధానం చేస్తూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తేల్చారు. మంగ్లీ, అడ్వకేట్ సుబ్బారావు తనకు పరిచయం ఉన్న వ్యక్తులు కావడంతో, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, బాధితులకు న్యాయం జరగాలని మాత్రమే తాను సూచించినట్లు తెలిపారు. దానికి మించి ఇందులో తన పాత్ర ఏమి లేదని పబ్లిక్ నోట్ రిలీజ్ చేశారు.

అంతేకాదు ఈ కేసు విషయంపై ఎఫ్ఐఆర్ లో తన పేరు నిందితుడిగా ఎక్కడా ప్రస్తావించలేదని తేల్చారు. ఈ కేసు పెట్టిన అడ్వకేట్ సుబ్బారావు మీడియా ముందు మాట్లాడుతూ.. తనకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా తెలిపినట్లు వివరించారు. అయితే కొన్ని చోట్ల నిజానిజాలు తెలుసుకోకుండా తన పేరును ఈ వ్యవహారంతో కలిపి ప్రచారం చేయడం బాధకరం అని ఆవేదన వ్యక్తం చేశారు . పంజాగుట్ట పోలీస్ వారు కూడా తమ విచారణలో తనకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించినట్లు వివరించారు. ఒక వ్యక్తి పరువు, ప్రతిష్ఠ, కుటుంబం.. ఇవన్నీ కూడా ఇలాంటి వార్తల వల్ల ప్రభావితమవుతాయని వేణు ఊడుగుల (Venu Udugula) వాపోయారు. దయచేసి ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని చేయొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, దర్శకుడు వేణు ఊడుగుల.. నీది నాది ఒకటే కథ, విరాట పర్వం చిత్రాలతో రైటర్ గా, దర్శకుడిగా తన శైలి చాలా విభిన్నమని నిరూపించాడు. రీసెంట్ గా వచ్చి విజయాన్ని అందుకున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’కి నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

Read Also: ఎండల నుంచి ఉపశమనానికి ఆయుర్వేద చిట్కాలు

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>