కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన ‘K-RAMP’ మూవీ మంచి సక్సెస్‌ను అందుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో నిర్మాత రాజేష్(Rajesh Danda) రెచ్చిపోయారు. ఓ వెబ్‌సైట్‌ను టార్గెట్ చేస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందులో కొన్ని అసభ్యకర వ్యాఖ్యలను కూడా చేశారు. కాగా, ఆయన వ్యాఖ్యలపై స్పందించిన సౌత్ ఇండియా డిజిటల్ పబ్లిషర్స్ అసోసియేషన్.. రాజేశ్ తీరు అభ్యంతరకరంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు కూడా ఎస్‌ఐడీపీఏ స్పష్టం చేసింది. ఏవైనా ప్రొఫెషనల్ డిఫరెన్సెస్ ఉంటే వాటిని గౌరవ మర్యాదలతో వెల్లడించాలని, పబ్లిక్‌గా ఒకరిని నొప్పించేలా మాట్లాడటం సరికాదని పేర్కొంది. రాజేశ్ తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది.
SIDPA లేఖపై స్పందించిన రాజేశ్(Rajesh Danda).. మరోసారి తనదైన స్టైల్‌లో రిప్లై ఇచ్చారు. మాపైన ఆధారపడి వెబ్‌సైట్లు నడుపుతూ.. మా సినిమాలను తొక్కేడం తప్పని, ఇప్పుడూ అదే చెప్తున్నానని అన్నాడు. ‘‘నేను వాడిన భాష అభ్యంతరకం అని అంటున్నారు. కోట్ల రూపాయలు పోసి సినిమా చేస్తే దాన్ని చంపేస్తున్నారు. నాకు రూ.కోట్ల నష్టం కలిగించే ప్రయత్నం చేస్తుంటే కోపం రాదా? నేను మనిషినే కదా. అందుకే అలా మాట్లాడాను. అంతకుమించి మరే సంస్థ, వ్యక్తిపైనా నేను కోపం చూపలేదు. నాకు కోపం లేదు కూడా. జర్నలిస్ట్‌లు, జనాలు, మీమర్స్ అందరిపైనా నాకు గౌరవం ఉంది. నా మాటలు బాధ, కోపంలో వచ్చినవే. ఆ విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. నా కోసం సినిమాను చంపుతున్న కొందరిపై మాత్రమే’’ అని వివరణ ఇచ్చారు రాజేశ్.
Read Also: వెంకీ, త్రివిక్రమ్ కాంబో.. హీరోయిన్ ఫిక్స్..

