epaper
Tuesday, November 18, 2025
epaper

రౌడీ వేధింపులకు వివాహిత బలి..

ఖమ్మం(Khammam) జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో ఘోరం జరిగింది. రౌడీ షీటర్ వేధిందిపులు తట్టుకోలేక బోడ సుశీల అనే మహిళ ఆత్మహత్య చేరసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. రౌడీ షీటర్ ధరావత్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికుడు కోరుతున్నారు. సుశీల భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుశీల మరో మహిళతో కతి అమ్మపాలెం గ్రామానికి పత్తి ఏరే పనికి వెళ్లింది. పొలంలో సుశీలను చూసి రౌడీ షీటర్ ధరావత్.. ఆమె దగ్గరకు వెళ్లి తన కోరిక తీర్చాలంటూ వేధించసాగాడు. బలవంతం చేయసాగాడు. దాంతో సుశీల ప్రతిఘటించడంతో దాడి చేశాడు. గాయాలతో ఇంటికి చేరుకున్న సుశీల మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది.

Khammam | అయితే ఈ ఘటనలో పోలీసులు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సుశీల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె శరీరంపై ఉన్న గాయాలను పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో చేర్చకపోవడం అందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సర్వజనాసుపత్రి ముందు సుశీల కుటుంబీకులు ఆందోళనకు దిగారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న ఇన్‌స్పెక్టర్ ఉస్మాన్ ఫరీఫ్, ఎస్సైలు.. వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చి, సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు.

Read Also: కాంగ్రెస్.. కమీషన్ ప్రభుత్వాన్ని నడుపుతోంది: బండి

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>