స్టార్ హీరో వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) కాంబోలో మూవీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ కాంబో మూవీలో హీరోయిన్ కోసం మూవీ టీమ్ వెతుకుతోంది. కాగా, తాజా హీరోయిన్‌ను కూడా ఫిక్స్ చేసేశారట. ఆమె ఎవరో కాదు.. ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty). ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. కేజీఎఫ్ హిట్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసిన శ్రీనిధి.. ఆ తర్వాత వరుస సినిమాతో బిజీ అయిపోయింది. మంచి కథలు ఎంచుకుంటూ కెరీర్‌ను హిట్‌గా ముందుకు కొనసాగిస్తోంది.
ఇదిలా ఉంటే వెంకటేష్(Venkatesh), త్రివిక్రమ్(Trivikram) కాంబోలో వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. గతంలో వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్.. మాటలు రాసినా.. వెంకీని ఇప్పటి వరకు ఎప్పుడూ డైరెక్ట్ చేయలేదు. కాగా, ఇప్పుడు అది కూడా చేసేయాలని గురూజీ గట్టిగా ఫిక్స్ అయ్యాడు. కాగా ఈ సినిమా జానర్ ఏంటి? అనేది ఇంకా క్లారిటీ రాలేదు.
Read Also: మిరాయ్ రికార్డ్.. ఊహించని రేంజ్‌లో వ్యూస్..

