Mobile Popup Ad
Mobile Popup Ad

జెన్ – జీ.. తండ్రి బెదిరించాడని ఏకంగా 100 కి.మీ సైకిల్ తొక్కిన బాలుడు

కలం, వెబ్ డెస్క్ : నేటి పిల్లలు కొన్ని సార్లు ఎవరికీ అర్థం కాని రీతిలో ప్రవర్తిన్నారు. చిన్న చిన్న విషయాలకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు లేదా టీచర్స్ మందలించినా ఓర్చుకోవడం లేదు. ఈ క్రమంలో తండ్రి బెదిరించాడన్న కోపంతో ప్రొద్దుటూరు (Proddatur) కు చెందిన ఓ బాలుడు ఏకంగా 100 కిలో మీటర్లు సైకిల్ పై ప్రయాణించాడు. సైకిల్ తీసుకుని ప్రొద్దుటూరు నుంచి బయలుదేరి, రాత్రంతా ఆగకుండా సైకిల్ తొక్కుతూ నంద్యాలకు చేరుకున్నాడు. సైకిల్ ను అమ్మాలని ప్రయత్నించగా సైకిల్ షాపు యజమానికి అనుమానం వచ్చి ప్రశ్నించడంతో భయపడి సైకిల్ ను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.

అనంతర రైల్వే స్టేషన్ కు వెళ్లి రైలెక్కి కర్ణాటకలోని రాయచూర్ కు చేరుకున్నాడు. మరోవైపు, తమ కొడుకు కనిపించడం లేదని బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ టీవీ కెమెరాలు ఆధారంగా బాలుడు నంద్యాలకు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో నంద్యాలకు వెళ్లి అక్కడ సైకిల్ ద్వారా బాలుడి ఆచూకి తెలుసుకున్నారు. స్థానిక పోలీసుల సాయంతో బాలుడు రాయచూర్ వెళ్లినట్లు గుర్తించి ప్రొద్దుటూరుకు (Proddatur) తీసుకొచ్చారు. బాలుడిని తమకు అప్పగించడంతో తల్లిదండ్రులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, బాలుడు సైకిల్ పై 100 కిలోమీటర్లు ప్రయాణించడంతో నెటిజన్లతో పాటు పోలీసులు తీవ్ర విస్మయానికి గురయ్యారు.

Read Also: నకిలీ CISF అధికారి హల్‌చల్: పెళ్లి పేరుతో 67 మందికి టోకరా !

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>