నకిలీ CISF అధికారి హల్‌చల్: పెళ్లి పేరుతో 67 మందికి టోకరా !

కలం, వెబ్ డెస్క్​ : హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) సాక్షిగా ఒక నకిలీ అధికారి మోసం వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారిగా చలామణి అవుతూ విమానాశ్రయ పరిసరాల్లో హడావిడి చేస్తున్న ఒక వ్యక్తి (Fake CISF officer)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలకృష్ణగా గుర్తించారు.

నిందితుడు బాలకృష్ణ సీఐఎస్ఎఫ్ యూనిఫాం (Fake CISF Officer) ధరించి, తాను ఆ విభాగంలో ఉన్నత అధికారిగా పనిచేస్తున్నానని నమ్మిస్తూ ఎయిర్‌పోర్ట్‌లో తిరుగుతుండేవాడు. కేవలం విమానాశ్రయంలో హడావిడి చేయడమే కాకుండా, మాట్రిమోనీ వెబ్‌సైట్‌లలో పోలీస్ యూనిఫాంలో ఉన్న తన ఫోటోలను అప్‌లోడ్ చేసి యువతులకు వల వేసేవాడు. తాను ప్రభుత్వ అధికారిని అని నమ్మించి ఇప్పటివరకు ఏకంగా 67 మంది మహిళలను పెళ్లి పేరుతో మోసం చేసినట్లు విచారణలో తేలింది. నిందితుడి కదలికలపై అనుమానం వచ్చిన విమానాశ్రయ భద్రతా సిబ్బంది అతడిని విచారించగా అసలు రంగు బయటపడింది. వెంటనే అతడిని అరెస్ట్ చేసిన అధికారులు, ఈ భారీ మోసం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.

Read Also: వినతిపత్రాన్ని విసిరికొట్టి.. సిఐటియు నేతలపై జనసేన ఎమ్మెల్యే ఆగ్రహం !

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>