కలం, ఖమ్మం బ్యూరో: రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు, హక్కుల ద్వారానే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. మంగళవారం ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి విగ్రహానికి మంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి (Ponguleti) మాట్లాడుతూ.. భారత రత్న, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి (Anudeep Durishetty), స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: జెన్ – జీ.. తండ్రి బెదిరించాడని ఏకంగా 100 కి.మీ సైకిల్ తొక్కిన బాలుడు
Follow Us On: X(Twitter)

