NTR Dragon OTT | టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబోలో తెరెక్కుతున్న సినిమా ‘డ్రాగన్’. ఈ సినిమాపై ఇప్పటికే తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుందని ఫ్యాన్స్ ఇప్పటికే ఊహల్లో తేలిపోతున్నారు. పవర్ ఫుల్ హీరోని పవర్ ఫుల్ దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి.. ‘డ్రాగన్’లో యాక్షన్ వీరలెవెల్లో ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ఇంతలో ఫ్యాన్స్‌కు షాకింగ్ విషయం ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదే ‘డ్రాగన్’ ఓటీటీ రిలీజ్. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఇప్పటికే మూవీ టీం ఒక క్లారిటీకి కూడా వచ్చేసినట్లు తెలుస్తోంది.
NTR Dragon OTT | ‘డ్రాగన్’ ఓటీటీ రిలీజ్ విషయంలో మూవీ మేకర్స్, ప్రముఖ ఓటీటీ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది. సినిమా థియేటర్స్‌లో విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి ‘డ్రాగన్’ ఎంట్రీ ఉండాలని అగ్రిమెంట్‌లో స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. సినీ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ వార్త.. ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. ‘డ్రాగన్’ మూవీతో థియేటర్లలో వచ్చే ఎన్‌టీఆర్ మానియాకు 8వారాల సమయం ఏమాత్రం సరిపోదని అభిమానులు అంటున్నారు.
Read Also: నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు: సిద్ధూ

