టాలీవుడ్ హీరో నాగార్జున, ఆయన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) చేసిన వ్యాఖ్యలు గతంలో సంచలనంగా మారాయి. ఈ అంశంపై కోర్టులో కూడా పరువునష్టం దావాలు దాఖలయ్యాయి. అయితే ఈ అంశంపై తాజాగా మరోసారి కొండా సురేఖ స్పందించారు. ఆ విషయంలో తాను చాలా మనస్థాపానికి గురయ్యానని ఆమె అన్నారు. రెడ్డి నేతలపై మంగళవారం ఘాటు వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ.. నాగార్జున విషయంలో తన మాటలను వక్రీకరించారని అన్నారు.
‘‘నటుడు నాగార్జున(Akkineni Nagarjuna) విషయంలో నేను మాట్లాడింది ఒకటి. ప్రచారం చేసింది ఇంకొకటి. దాన్ని వివాదంగా చిత్రీకరించిన తీరు వేరు. దానితో నేను మనస్థాపానికి గురయ్యాను. అప్పటి నుంచి మీడియాను కూడా దూరం పెట్టాను. అందుకే మీడియాతో ఓపెన్‌గా ఉండటం లేదు. నేను ఏది ఉన్నా ముక్కుసూటిగా చెప్పే మనస్తత్వం నాది. ఏ సమస్య ఉన్నా నేను పార్టీ అధిష్టానానికే చెప్తాను’’ అని కొండా సురేఖ(Konda Surekha) అన్నారు.
Read Also: నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు: సిద్ధూ

