ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడనున్న టీ20, వన్డే సిరీస్‌లలో తన పేరు లేకపోవడంపై సీనియర్ బౌలర్ మహ్మద్ షమి(Mohammed Shami) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన పేరు పరిశీలనలో కూడా లేకపోవడంతో సెలక్టర్లపై విమర్శలు చేశారు. రంజీలు ఆడుతున్న తాను వన్డేల్లో మాత్రం ఎందుకు ఆడలేను? అని ప్రశ్నించారు. ప్రస్తుతం షమీ.. అక్టోబర్ 15 నుంచి ప్రారంభమయ్యే 2025-26 రంజీ ట్రోఫీ సీజన్‌కు రెడీ అవుతున్నారు. అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్సీలో రంజీ బరిలోకి దిగే పశ్చిమబెంగాల్ జట్టును ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఇందులో షమీ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియాలో తనకు చోటు దక్కకపోవడంపై షమీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
‘‘టీమిండియా యాజమాన్యం నా ఫిట్‌నెస్ గురించి నాతో మాట్లాడట్లేదు. నా ఫిట్‌నెస్ అప్‌డేట్ వాళ్లకు నేను చెప్పడం కాదు. వాళ్లే నన్ను అడగాలి కదా. నాలుగు రోజులు జరిగే రంజీ మ్యాచ్ ఆడగలే నా ఫిట్‌నెస్.. వన్డే మ్యాచ్ ఆడటానికి సరిపోదా? నేను ఫిట్‌గా లేకపోతే నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉండేవాడిని. రంజీ ట్రోఫీకి ఎందుకు సిద్దమవుతాను. ఎలా సెలక్ట్ అవుతాను’’ అని అన్నారు. అయితే షమి చాలా ఏళ్లుగా పెద్దగా క్రికెట్ ఆడలేదని, ఎంపిక కోసం క్రమం తప్పకుండా మ్యాచ్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుందని, అందుకే అతనిని జట్టుకు ఎంపిక చేయలేదని సెలక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) అన్నారు. ఆయన మాటలకే షమీ(Mohammed Shami) బదులిచ్చాడు.
Read Also: ‘డ్రాగన్’ OTT రిలీజ్ అప్పుడే.. !

