కలం, వెబ్ డెస్క్ : ప్రభాస్ ఫ్యాన్స్ ఓ హీరోయిన్ పేరును తెగ మోసేస్తున్నారు. మనం గతంలో కూడా ఇలాంటివి చాలానే చూశాం కదా. ప్రభాస్ (Prabhas) గురించి ఏ హీరోయిన్ అయినా పాజిటివ్ గా మాట్లాడితే చాలు ఆయన ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పోస్టులు పెట్టేస్తారు. ఆ హీరోయిన్ ను ఓన్ చేసేసుకుంటారు. ఇప్పుడు ది రాజాసాబ్ హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆమెను వదిన అనేస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆమె ఎవరో కాదండోయ్ హీరోయిన్ రిద్ధి కుమార్.
ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ రిద్ధి కుమార్(Riddhi Kumar) మాట్లాడుతూ.. ‘ఈ చీర ప్రభాస్ (Prabhas) ఇచ్చాడని.. దీన్ని కట్టుకోడానికి మూడేళ్లు వెయిట్ చేశానని’ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ విపరీతంగా పోస్టులు పెట్టేస్తున్నారు. ప్రభాస్ చీర ఇచ్చాడంటే ఆమె మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందేమో అని.. ఇంకొందరు అయితే వదిన అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో రిద్ధి పేరు మార్మోగిపోతోంది.
Read Also: వీరమల్లు 2 లేదా? నిధి అగర్వాల్ షాకింగ్ రిప్లై!
Follow Us On : WhatsApp


