epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

వీరమల్లు 2 లేదా? నిధి అగర్వాల్ షాకింగ్ రిప్లై!

కలం, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన భారీ పీరియాడిక్ మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమాలో పవన్ కు జంటగా నిధి అగర్వాల్ (Nidhi Agarwal) నటించింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ ఇయర్ లో రిలీజైన విషయం తెలిసిందే. అయితే.. ఈ మూవీ ఎండింగ్ లో వీరమల్లు పార్ట్ 2 ఉందని ప్రకటించారు. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. ఏఎం రత్నం, జ్యోతికృష్ణ ఖచ్చితంగా వీరమల్లు 2 ఉంటుందని అనౌన్స్ చేశారు. అయితే.. హరి హర వీరమల్లు 2  గురించి అసలు నిజం నిధి అగర్వాల్ బయటపెట్టింది. ఇంతకీ.. నిధి వీరమల్లు 2 గురించి ఏం చెప్పింది..?

నిధి అగర్వాల్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జంటగా రాజాసాబ్ మూవీలో నటించింది. మారుతి తెరకెక్కించిన రాజాసాబ్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ సినిమాను జనవరి 9న భారీ స్థాయలో రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన నిధి అగర్వాల్ కు వీరమల్లు 2 (Hari Hara Veera Mallu 2) గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి నిధి సరైన సమాధానం చెప్పడం లేదు. వీరమల్లు గురించి ఇప్పుడే మాట్లాడలేను.. అది మొదలైనప్పుడు చూద్దాం అంటూ సమాధానం చెబుతుంది. దీనిని బట్టి.. ఆ సినిమా మొదలవుతుందని తనకే నమ్మకం లేదనే విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా బయటపెట్టింది.

నిజానికి నిధి అగర్వాల్ (Nidhi Agarwal) వీరమల్లు పార్ట్ 1 లో చాలా తక్కువ సేపే కనిపించింది. సెకండ్ పార్ట్ లో చూపిద్దామని దాచేశారు. ఇప్పుడు వీరమల్లు పార్ట్ 2 లేకుండా పోయింది. ఇదిలా ఉంటే.. నిధి అగర్వాల్ నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్ కు కూడా పార్ట్ 2 ఉందని చెబుతున్నారు. అయితే.. నిజంగా ఉంటుందా అంటే.. రిజెల్ట్ పై ఆధారపడి ఉంటుంది. మరి.. రాజాసాబ్ 2.. వీరమల్లు 2 లా అవుతుందో.. లేక చెప్పినట్టుగానే ఖచ్చితంగా పార్ట్ 2 తీస్తారో క్లారిటీ రావాలంటే.. రాజాసాబ్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Read Also: వారణాసి తర్వాత మహేష్ సొంత బ్యానర్ మూవీ… సందీప్ రెడ్డి వంగ కాంబో ఫిక్స్?

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>