epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఫుల్లుగా తాగి ఎస్​ఐని కొట్టిన నేవీ అధికారి

కలం, వెబ్ డెస్క్​ : తాగిన మత్తులో కొందరు పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన సంఘటనలను చాలానే జరుగుతాయి. కానీ, విశాఖపట్నం (Visakhapatnam) లో ఓ నేవీ ఆఫీసర్​ ట్రాఫిక్​ ఎస్​ఐపై దాడి చేశాడు. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం మల్కాపురం ప్రాంతంలో ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్ (IOC)పైప్​ పనులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇండియన్​ నేవీ లెఫ్టినెంట్​ కమాండర్​ రాహుల్ కృష్ణ అదే దారిలో వచ్చాడు. అక్కడే ట్రాఫిక్​ నియంత్రిస్తున్న ట్రాఫిక్​ ఎస్ఐ శ్రీనివాస్ రావు.. కృష్ణను కారు ఆపాలని కోరారు.

దీంతో తాగి ఉన్న కృష్ణ కోపంతో వాగ్వాదానికి దిగాడు. అంతే కాకుండా ఎస్​ఐని కొట్టాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు నేవీ ఆఫీసర్​ కు డ్రంక్​ టెస్ట్​ చేయగా పాజిటివ్ వచ్చింది. ఎస్​ఐ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు రాహుల్​ కృష్ణపై మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు. కాగా, బాధ్యత కలిగిన నేవీ అధికారి మద్యం తాగి పోలీసులపై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. Visakhapatnam లో జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>