Mobile Popup Ad
Mobile Popup Ad

ఎల్లుండి చేప ప్రసాదం.. మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈనెల 8 వ తేదీ (సోమవారం) రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ (Fish Prasadam Distribution ) ప్రారంభం కానుంది. 179 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రసాదం కోసం రేపు దూద్‌బౌలిలో బావి పూజ నిర్వహించనున్నారు. చేపతో ఇబ్బంది ఉన్న వారికి బెల్లం ప్రసాదం అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. మృగశిర కార్తె సందర్భంగా అస్తమా వ్యాధిగ్రస్తులకు వేసే చేప ప్రసాదం పంపిణీపై నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాట్లను సహచర మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పర్యవేక్షించారు. చేప ప్రసాదం పంపిణీ కి సంబంధించి ఏర్పాటు చేసిన భారీకేడ్ లను పరిశీలించారు.

తొక్కిసలాట జరగకుండా చూడాలి..

అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. చేప ప్రసాదం పంపిణీ సోమవారం ప్రారంభం అవుతుండడంతో వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్యూలైన్ లలో తొక్కిసలాట జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. శాంతి, భద్రతలకి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని.. విద్యుత్ సరఫరా లో ఆటంకం లేకుండా చూసుకోవాలని చెప్పారు. వేసవి కాలం ఉక్కపోత గా ఉండడంతో క్యూ లైన్ లు ఉన్న ప్రాంతాల్లో ఫ్యాన్ కు , కూలర్ లు ఏర్పాటు చేయాలని అన్నారు చేప ప్రసాదం పంపిణీ పూర్తయ్యే వరకు అన్ని విభాగాల అధికారులు వాట్సప్ గ్రూప్ ద్వారా పర్యవేక్షణ చేయాలని.. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కంట్రోల్ రూమ్ ద్వారా మానిటరింగ్ చేయాలని చెప్పారు.

సీపీఆర్ బృందాలు ఏర్పాటు చేయాలి..

నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. అంబులెన్స్ లు ఏర్పాటు చేయడంతో పాటు మెడికల్ క్యాంపులు అవసరమైన మందులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. క్యూలైన్ మద్యలో సీపీఆర్ బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. సమాచారం అందించడానికి మైకుల ద్వారా క్లియర్ ఆడియో ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఫైర్ ఇంజన్ వాహనాలు అందుబాటులో ఉంచాలని.. షీ టీమ్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. సీసీ కెమరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. తాగు నీరులో ఇబ్బందులు రావద్దని వచ్చిన భక్తులకు ప్రతి సంవత్సరం మాదిరి స్వచ్ఛంద సంస్థలు ఆహారాన్ని, అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, షాట్ చైర్మన్ శివసేనారెడ్డి ,ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>