ఏపీ ప్రయోజనాల కోసం కృషి చేస్తా: లింగమనేని

కలం, వెబ్ డెస్క్: తాను ఏపీ ప్రయోజనాల కోసం కృషి చేస్తానని జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేశ్ (Lingamaneni Ramesh)  పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. “తనపై నమ్మకంతో రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రజల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతానని పేర్కొన్నారు. జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ.. “జనసేన పార్టీ తరఫున లింగమనేని రమేశ్ రాజ్యసభకు వెళ్లడం తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఆయన సరైన వ్యక్తి. ఈ ఎంపిక పట్ల జనసేన పార్టీ శ్రేణులంతా ఎంతో సంతోషంగా ఉన్నాయి” అని పేర్కొన్నారు.

Read Also: చల్లటి కబురు.. ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>