ఈ నెల 27న పొంగులేటి ఉమ్మ‌డి నిజామాబాద్‌, ఆదిలాబాద్ జిల్లా స‌మావేశాలు

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇందిర‌మ్మ ఇళ్లు, రెవెన్యూ అంశాల‌పై రాష్ట్ర రెవెన్యూ, హ‌సింగ్, సమాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy) సోమ‌వారం నుండి క్షేత్రస్థాయి సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 27న ఉమ్మ‌డి నిజామాబాద్‌, ఆదిలాబాద్ జిల్లా స‌మావేశాలు జరుగనున్నాయి. హిమాయ‌త్‌న‌గ‌ర్ లోని హౌసింగ్ కార్పొరేష‌న్ కార్యాల‌యంలో సోమ‌వారం ఉద‌యం ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా సమావేశం.. అనంతరం మ‌ధ్యాహ్నం ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ప్ర‌జా ప్ర‌తినిధులు, క‌లెక్ట‌ర్లతో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌కు సంబంధించి ఇటువంటి స‌మావేశాల‌ను ద‌శ‌ల‌వారీగా నిర్వ‌హించ‌నున్నారు.

రాష్ట్రంలో తొలి విడ‌త‌గా మూడున్న‌ర ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్ల (Indiramma Indlu) మంజూరు, సుమారు ల‌క్ష‌కుపైగా ఇళ్ల గృహ ప్ర‌వేశాల‌కు సిద్ద‌మైన నేపథ్యంలో పొంగులేటి (Ponguleti) స‌మావేశం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల పూర్తి, కేటాయింపు, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న వంటి విష‌యాల‌ను సైతం చర్చించనున్నారు. త్వ‌ర‌లో రెండ‌వ విడ‌త ఇళ్ల మంజూరుకు సంబంధించి ఈ స‌మావేశంలో చ‌ర్చించే అవ‌కాశాలు ఉన్నాయి. భూ వివాదాలు, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ,తాజాగా అమ‌లు చేస్తున్న భూధార్, స‌ర్వేమ్యాప్‌ల వంటి కీలక రెవెన్యూ అంశాలపై జిల్లా అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. ఈ స‌మావేశంలో ఆయా జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా క‌లెక్ట‌ర్లు, అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్లు, ఆర్డీవోలు, జిల్లా హౌసింగ్ అధికారులు పాల్గొన‌నున్నారు.

Read Also: తాగునీటి సమస్యలు.. అధికారుల‌పై క‌లెక్ట‌ర్ ఆగ్ర‌హం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>