Mobile Popup Ad
Mobile Popup Ad

DC ప్లేయర్ లుంగి ఎన్‌గిడికి తీవ్ర గాయం

కలం, స్పోర్ట్స్: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో అపశృతి చోటు చేసుకుంది. ప్రభ్ సిమ్రన్ కొట్టిన బంతిని దిల్లీ ప్లేయర్ లుంగి ఎన్‌గిడి (Lungi Ngidi) క్యాచ్ పట్టబోయి నియంత్రణ కోల్పోయి వెల్లకిలా పడిపోయాడు. ఈ క్రమంలో శరీర బరువు మొత్తం మెడపై పడటంతో తీవ్ర గాయమై బాధతో విలవిలాడిపోయాడు. వెంటనే స్టేడియంలోకే అంబులెన్స్ ని రప్పించి.. ఆసుపత్రికి తరలించారు.

దూరమైతే ఢిల్లీకి ఎదురు దెబ్బ..

ఎన్‌గిడి ఆరోగ్యంపై క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. కీలకమైన బౌలర్ గా ఉన్న ఎన్‌గిడి (Lungi Ngidi) దూరం కావడ ఢిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.

Read Also: ఐపీఎల్ చరిత్రలో సంచలనం.. 264 లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>