కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మేడారంలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే పలుమార్లు మేడారం జాతర(Medaram Jatara )ను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడారం జాతర జరగడం రెండోసారి అని పొంగులేటి వెల్లడించారు. ఈ జాతరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ఆలోచనలకు అనుగుణంగా ప్రజల రాకను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మేడారం జాతరను మరో కుంభమేళాలా ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్థానికంగా ఎన్నో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ పనుల కోసం కష్టపడ్డ ప్రతి అధికారికి, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.


