కలం వెబ్ డెస్క్ : హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణ చైతన్య(Krishna Chaitanya) ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు(Doctors) సోమవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. చైతన్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. చైతన్య ఆదివారం హయత్‌నగర్ పరిధిలోని తన నివాసంలో గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఎల్బీనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. తలలో బుల్లెట్ దూసుకెళ్లి తీవ్రంగా గాయం కావడంతో సర్జరీ చేసినట్లు వైద్యులు తెలిపారు. ఇంకా రెండు రోజులు గడిస్తే గానీ పరిస్థితి ఏమిటన్నది చెప్పలేమన్నారు.
తొలుత ఆర్థిక ఇబ్బందులతోనే చైతన్య ఆత్మహత్యకు యత్నించినట్లు ప్రచారం జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న రంగనాథ్(AV Ranganath) వెంటనే ఆస్పత్రికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్‌ల వ్యవసనంతో అప్పుల పాలై చైతన్య(Krishna Chaitanya) ఆత్మహత్యకు యత్నించాడని మీడియా ముందు రంగనాథ్ తెలిపారు. రంగనాథ్ వ్యాఖ్యలను కృష్ణ చైతన్య తండ్రి ఖండించారు. తమ కుటుంబం ఆర్థికంగా బాగానే ఉందని, తమ కుమారుడికి బెట్టింగ్ అలవాటు లేదని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై ఇద్దరూ వేర్వేరు వివరణలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. చైతన్య ఆత్మహత్యాయత్నానికి అసలు కారణమేంటన్నది తేలాల్సి ఉంది.
Read Also: రాయదుర్గం కో – లివింగ్ హాస్టల్‌లో డ్రగ్స్ దందా !
Follow Us On: Pinterest


