కలం వెబ్ డెస్క్ : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. పంచాయతీలకు వచ్చే నిధుల దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం(Central Govt) స్పెషల్ ఫోకస్ పెట్టింది. నిధుల విషయంలో అక్రమాలు జరగకుండా ఉండేందుకు మేరీ పంచాయత్ యాప్(Meri Panchayat app)ను తీసుకొచ్చింది. సర్పంచ్‌లుగా ఎన్నికైన వారిపై అనేక బాధ్యతలు ఉంటాయి. పల్లెలకు వివిధ రూపాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తుంటాయి. నిధులను ఏ అభివృద్ధి పనుల కోసం ఖర్చు పెట్టాలనే బాధ్యత పాలకులపై ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే పలుచోట్ల అక్రమాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి, పాలన తీరు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మేరీ పంచాయత్ యాప్(Meri Panchayat App)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ను స్మార్ట్ ఫోన్ లోని ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని సంబంధిత వివరాలతో లాగిన్ కావాలి. ఇందులో లాగిన్ వివరాలకు అనుగుణంగా ఆ పల్లెకు సంబంధించిన నిధుల వివరాలు, వార్డు వారీగా ఖర్చులు, చేపట్టిన పనుల చిత్రాలు కనిపిస్తాయి. జియోట్యాగింగ్‌లో ఆస్తులు, ఆదాయ వివరాలు, పాలకవర్గం పంచాయతీ కార్యదర్శి, అధికారుల వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. దీని ద్వారా ఏ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో తెలుసుకోవచ్చు.
Read Also: సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్ట్ నోటీసులు
Follow Us On: Youtube


