కలం, వెబ్ డెస్క్ : సమాజంలో మూఢనమ్మకాలను నమ్మొద్దని ఒక పోలీస్ అధికారి (Police Officer) చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా రోడ్డు కూడళ్లలో నిమ్మకాయలు, కోడిగుడ్లు, పసుపు, కుంకుమలు కనిపిస్తే.. ఏదో కీడు జరుగుతుందనే భయంతో సామాన్యులు వాటిని దాటడానికి కూడా జంకుతారు. కానీ, పోలీస్ అధికారి ఓంప్రకాశ్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు.
రోడ్డుపై పారేసిన ఆ వస్తువుల దగ్గరకు వెళ్లడమే కాకుండా, అక్కడే ఉన్న కొబ్బరికాయను కొట్టి, తిని అందరినీ ఆశ్చర్యపరిచారు. అక్కడితో ఆగకుండా, ప్రజలు భయపడే ఆ నిమ్మకాయలు, కోడిగుడ్లలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలనూ వివరించారు. ఇలాంటి పనుల వల్ల రోగాలు నయం కావని, అవన్నీ కేవలం భ్రమలు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
రోడ్డుపై పిచ్చి నమ్మకాలతో ఇలాంటివి వేయడం వల్ల ప్రజల్లో అనవసర భయాందోళనలు కలుగుతాయని, ఇలాంటి అర్థం లేని పనులను మానుకోవాలని ఆయన పేర్కొన్నారు. మూఢనమ్మకాలపై ఒక అధికారి (Police Officer) స్వయంగా రంగంలోకి దిగి అవగాహన కల్పించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రోడ్డుపై కోడిగుడ్డు, కొబ్బరికాయ.. పోలీస్ ఏం చేశాడంటే ?#PoliceOfficer #BlackMagic #Kalam #KalamDaily #KalamTelugu pic.twitter.com/yxw1HIHcy4
— Kalam Daily (@kalamtelugu) April 2, 2026
Read Also: ఎన్టీఆర్ టు కవిత.. నేతలందరిదీ అదే మాట..
Follow Us On: Instagram

