పోలీసుల మెరుపు వేగం.. ఆరేళ్ల పిల్లాడి కథ సుఖాంతం!

కలం, మహబూబాబాద్‌ : తండ్రి మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆరేళ్ల బాలుడి ఆచూకీని కేసముద్రం పోలీసులు (Kesamudram Police) కేవలం 12 గంటల్లోనే గుర్తించి, క్షేమంగా తండ్రికి అప్పగించారు. మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి చేపట్టిన గాలింపు ఫలించడంతో కుటుంబ సభ్యులు ఊరట చెందారు.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం ఉపాధి నిమిత్తం మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం ప్రాంతానికి వచ్చి, స్థానికంగా ఓ పరిశ్రమలో పనిచేస్తూ నివాసం ఉంటోంది. ఈ క్రమంలో తండ్రి మందలించడంతో ఆరేళ్ల బాలుడు కదరి రాయ్‌సింగ్‌ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి కేసముద్రం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు అందిన వెంటనే జిల్లా ఎస్పీ డా. శబరీష్‌ ఆదేశాల మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. బాలుడి ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. సమాచారాన్ని విశ్లేషిస్తూ సమన్వయంతో ముందుకు సాగిన పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాలుడిని గుర్తించారు.

అనంతరం డీఎస్పీ తిరుపతిరావు, ఎస్‌ఐ క్రాంతికిరణ్‌, పోలీసు సిబ్బంది మోహన్‌, రాజు కేసముద్రం పోలీస్‌స్టేషన్‌లో బాలుడిని తండ్రికి క్షేమంగా అప్పగించారు. బాలుడిని సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో చురుకుగా వ్యవహరించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అదృశ్యమైన వ్యక్తుల ఆచూకీ గుర్తించేందుకు పోలీసు శాఖ తక్షణ స్పందనతో, సమన్వయంతో పనిచేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>