కలం, ఖమ్మం బ్యూరో: ముదిగొండలో జరిగిన టీఎస్ యూటీఎఫ్ (TSUTF) ఖమ్మం జిల్లా 7వ మహాసభల్లో జిల్లా కార్యదర్శిగా డీఎస్. నాగేశ్వరరావు (DS Nageswara Rao) వరుసగా ఐదవ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ డీఏలు, రెండవ పీఆర్సీ (PRC) సాధన, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులతో పాటు సీఆర్టీలు, కేజీబీవీ, గురుకుల ఉద్యోగులు మరియు గిరిజన సంక్షేమ పాఠశాలల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని స్పష్టం చేశారు.
ఉపాధ్యాయులందరికీ సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నాగేశ్వరరావు ఎన్నిక పట్ల ఏన్కూరు మండల కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి. రామ్ చంద్, మూడ్ పుల్లయ్య, కమిటీ సభ్యులు, మూల పోచారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నాగరాజు, ఉపాధ్యాయ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

