కలం, స్పోర్ట్స్: 19 ఏళ్లకే ప్రపంచ టెన్నిస్‌లో మరో ఘనత సాధిస్తూ తొలి ప్రయత్నంలోనే డబ్ల్యూటీఏ ఫైనల్స్ (WTA Finals) టైటిల్‌ను సొంతం చేసుకుంది రష్యా యువ సంచలనం మిర్రా ఆండ్రీవా (Mirra Andreeva). ఫైనల్లో ఉక్రెయిన్ స్టార్ ఎలినా స్విటోలినాను 7-5, 6-3తో ఓడించి సీజన్‌ను ఘనంగా ముగించింది. ఇండియన్ వెల్స్‌లో జరిగిన ఈ టోర్నీలో ఆండ్రీవా అజేయంగా నిలిచింది. ఐదు మ్యాచ్‌ల్లోనూ ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన ఆమె ఇప్పుడు డబ్ల్యూటీఏ ఫైనల్స్ కిరీటాన్నీ అందుకుంది.
దీంతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కెరీర్లోనే అత్యుత్తమంగా రెండో స్థానానికి చేరుకుంది. 19 ఏళ్ల వయసులో ఈ టైటిల్ గెలవడం మరో ప్రత్యేకత. 2004లో మరియా షరపోవా తర్వాత ఇంత చిన్న వయసులో డబ్ల్యూటీఏ ఫైనల్స్ విజేతగా నిలిచిన క్రీడాకారిణిగా ఆండ్రీవా రికార్డు సృష్టించింది. అయితే ఈ విజయంతో పాటు ఆమెకు మెర్సిడెస్ కారు కూడా బహుమతిగా లభించింది. కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో ప్రస్తుతానికి తన టీమ్ సభ్యులే ఆమెను కారులో తిప్పాల్సి ఉంటుంది.

