ప్రతి యువకుడు హనుమంతుడిలా మారాలి: ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా

కలం, నిజామాబాద్ బ్యూరో : ప్రతి యువకుడు హనుమంతుడిలా మారాలని, నిజాయితీగా ఉంటూ ధర్మాన్ని నిలబెట్టాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త (Dhanpal Suryanarayana Gupta) తెలిపారు. హనుమాన్ జన్మోత్సవాన్ని (Hanuman Jayanti) పురస్కరించుకొని గురువారం ఉదయం సారంగాపూర్, నీరుగొండ హనుమాన్ ఆలయాలను ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఈ పవిత్రమైన రోజు మనమందరము ఒక సంకల్పం చేయాలని, సమాజ సేవలో ముందుండాలన్నారు. ధర్మ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఇది ఒక పండుగ మాత్రమే కాదని, మనలోని శక్తిని మేల్కొలిపే రోజు అని తెలిపారు. శ్రీరాముడి సేవలో హనుమంతుడు చూపిన అంకితభావం, నిజాయితీ, ధైర్యం ప్రతి ఒక్కరికి మార్గదర్శకమన్నారు.

భక్తి, బలం, నిబద్ధతకు ప్రతీకైన ఆంజనేయస్వామి అందరికీ స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఇందూరులో నిర్వహించే హనుమాన్ శోభాయాత్ర తెలంగాణలోనే అతిపెద్ద శోభాయాత్రగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఇల్లెందుల ప్రభాకర్, పుట్ట వీరేందర్, మాయావార్ కృష్ణ, పవన్ ముందడ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Read Also: అసమర్ధ మంత్రులు వీరే.. హైకమాండ్‌కు ‘కాంగ్రెస్ ఫ్రెండ్స్’ సంచలన లేఖ..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>