కలం, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) రాజకీయ ప్రస్థానంలో మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్ర రాజకీయ చరిత్రలో వరుసగా ఐదుగురు ముఖ్యమంత్రులను కలిసిన ఏకైక ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించారు. గతంలో దివంగత సీఎం జయలలితతో పాటు, ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన పన్నీర్ సెల్వం, పళనిస్వామిలతో ప్రధాని పలుమార్లు అధికారికంగా భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ఆయా ముఖ్యమంత్రులతో ఆయన నిరంతరం సమన్వయం చేసుకుంటూ వచ్చారు.
అన్నా డీఎంకే (AIADMK) ప్రభుత్వాల అనంతరం అధికారంలోకి వచ్చిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో కూడా ప్రధాని సమావేశమయ్యారు. తాజాగా తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌తో కూడా ఇటీవల ఆయన భేటీ కావడంతో ఐదుగురు సీఎంలను కలిసిన ఏకైక ప్రధానిగా మోదీ (PM Modi) అరుదైన మైలురాయిని చేరుకన్నారు. దేశ చరిత్రలో ఏ ప్రధానికి సాధ్యం కాని రీతిలో వరుసగా ఒకే రాష్ట్రానికి చెందిన ఐదుగురు ముఖ్యమంత్రులతో పని చేయడంతో మోదీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Also: మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సు మంజూరు చేయండి.. సీఎంకు పొన్నం వినతి
Read Also: పెట్రో బాదుడు పాపం తలా పిడికెడు

