కలం, కరీంనగర్ బ్యూరో: శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని హుస్నాబాద్ (Husnabad) ఇంజనీరింగ్ కాలేజీలో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) లేఖ రాశారు. తెలంగాణలో ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ జిల్లాలలో, సింగరేణి కాలరీస్ ద్వారా బొగ్గు తవ్వకం కార్యకలాపాలు బలంగా ఉన్నాయని తెలిపారు. దేశంలో, ప్రపంచవ్యాప్తంగా అర్హత కలిగిన మైనింగ్ ఇంజనీర్లకు (Mining Engineering) డిమాండ్ పెరుగుతోందని ప్రస్తావించారు. అయితే ప్రస్తుతం ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలలో బి.టెక్ (మైనింగ్ ఇంజనీరింగ్) చదవడానికి అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన చాలా మంది విద్యార్థులకు ఆసక్తి, సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రైవేట్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో అధిక ఫీజుల కారణంగా ఈ కోర్సును చదవలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రాంతం బొగ్గు గనుల ప్రాంతంలో ఉండటం, గనుల పరిశ్రమలకు సమీపంలో ఉండటం వలన శాతావాహన విశ్వవిద్యాలయం పరిధిలో హుస్నాబాద్ పట్టణంలో కొత్తగా స్థాపించబడిన ఈ ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ (మైనింగ్ ఇంజనీరింగ్)ను ప్రవేశపెట్టడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ప్రస్తావించారు. ఈ విషయాల దృష్ట్యా హుస్నాబాద్‌లోని శాతావాహన యూనివర్సిటీ కాలేజీలో బి.టెక్ (మైనింగ్ ఇంజనీరింగ్) కోర్సును ప్రవేశపెట్టాలని, అలాగే అవసరమైన సిబ్బందిని మంజూరు చేయాలని పొన్నం (Ponnam Prabhakar) విజ్ఞప్తి చేశారు.
Read Also: బీజేపీ నేతలు రైతు గోస కాదు.. పెట్రోల్ గోస యాత్ర చేయాలి: పొన్నం
Follow Us On : WhatsApp

