Mobile Popup Ad
Mobile Popup Ad

రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో పీఎం మోడీ కీలక మీటింగ్

కలం, వెబ్ డెస్క్ : అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం వేళ ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఈ మీటింగ్ లో సీఎంలకు ప్రధాని కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. గల్ఫ్ లో అనిశ్చితి కారణంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్, చమురు కొరత కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ.. సీఎంలతో రేపు (శుక్రవారం) సాయంత్రం 6.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్న సమావేశంలో పశ్చిమాసియాలో పరిస్థితిపై చర్చించనున్నారు. ఈ భేటీలో విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత, వాళ్లను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ప్రణాళికపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అయితే, త్వరలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్న రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కోడ్ అమల్లో ఉంది. దీంతో ఆయా రాష్ట్రాల ముఖమంత్రులు ఈ భేటీలో పాల్గొనేందుకు అవకాశం లేదు. మోడల్ కోడ్ ఉన్న రాష్ట్రాల సీఎస్ లతో క్యాబినెట్ సెక్రటరీ వీసీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.  కాగా, పార్లమెంట్ సమావేశాల్లో పీఎం మోడీ పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశంలో ఇంధన కొరత నెలకుందని స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన క్రమంలో సీఎంలతో పీఎం (PM Modi) సమావేశంపై ఉత్కంఠ నెలకొన్నది.

Read Also: పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు మళ్ళీ నిరాశే !!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>