పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు మళ్ళీ నిరాశే !!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ (Telangana Employees PRC) పదవీ కాలాన్ని సర్కార్ మరోసారి పొడిగించింది. గతంలో పీఆర్సీ పదవీకాలాన్ని మార్చి 31, 2026 వరకు పొడిగించిన ప్రభుత్వం.. మరోసారి పొడిగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు PRC పదవీకాలం పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఎన్. శివశంకర్ నేతృత్వంలోని ఈ కమిషన్, ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి నివేదికను సమర్పించడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ పొడిగింపు వల్ల తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త వేతన స్కేల్స్ అమలు చేయడానికి మరింత ఆలస్యం అవనుంది. ఈ క్రమంలో పీఆర్సీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఉద్యోగులకు మరోసారి నిరాశ ఎదురైంది.

తెలంగాణ ప్రభుత్వం 2023లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్.శివశంకర్ చైర్మన్ గా రెండవ పీఆర్సీ (Telangana PRC) కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఇతర సిబ్బందికి కొత్త పే స్కేల్స్, ఫిట్ మెంట్ ఫ్యాక్టర్, అలవెన్సులు, ఇతర ప్రయోజనాలపై సిఫారసులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే గతంలోని పీఆర్సీ (సీ.ఆర్.బిస్వాల్ కమిషన్) సిఫారసులు 30% ఫిట్ మెంట్ తో అమలు చేయబడ్డాయి. కొత్త పీఆర్సీ సిఫారసులు రావడంతో ఉద్యోగులు ఎక్కువ ఫిట్ మెంట్, పెండింగ్ డీఏలను కూడా క్లియర్ చేయాలని ఆశిస్తున్నారు.

Read Also: వేగంగా పెరుగుతున్న లంగ్ క్యాన్సర్.. కారణాలు చెప్పిన అధ్యయనం

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>