దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. కేంద్రం కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : దేశంలో పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) కొరత లేదని.. ఎవరూ ఆందోళన చెందొద్దని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని.. కాబట్టి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల ముందు క్యూలైన్లు పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పందించింది. కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. అలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మొద్దని కోరింది.

ప్రపంచంలోనే భారత్ ఐదో అతిపెద్ద పెట్రోల్ ఎగుమతిదారుగా ఉందని.. ఇప్పటికీ 150 దేశాలకు పెట్రోల్ ఎగుమతి చేస్తోందని కేంద్రం చెప్పింది. ప్రస్తుతం దేశంలో రాబోయే 74 రోజుల దాకా సరిపడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ తెలిపింది. ఎల్పీజీ నిల్వలు కూడా రాబోయే రెండు నెలలకు సరిపడా ఉన్నాయని.. దేశీయంగా ఉత్పత్తులు పెంచామని.. దాని వల్ల దిగుమతులు తగ్గిపోయాయంటూ కేంద్రం వివరణ ఇచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>