బీహార్ ఎన్నికల్లో ఎన్‌డీఏ(NDA) కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. 243 స్థానాల్లో 202 స్థానాల్లో ముందంజలో ఉంది. పార్టీల పరంగా చూసుకుంటే బీజేపీ 90, జేడీయూ 84, ఆర్‌జేడీ 25, కాంగ్రెస్ 6, ఇతరులు 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దీంతో బీహార్(Bihar) ఎన్నికలో ఎన్‌డీఏ కూటమి విజయం ఖరారు అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ విజయంపై ప్రధాని మోదీ(PM Modi) స్పందించారు. బీహార్‌లో తమ విజయం వెనక ఉన్న రహస్యాన్ని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు అసాధారణమని అన్నారు. బిహార్‌లో సుపరిపాలన, అభివృద్ధి దిశలో చేపట్టిన ప్రయత్నాలే తమ కూటమికి విజయాన్ని అందించాయన్నారు. ఈ అపూర్వ ఫలితం బిహార్ పురోగతికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని మోదీ(PM Modi).. ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. అంతకుముందు ఈ ఎన్నిక ఫలితాలపై కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీయేతర అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తమ అభిప్రాయాలు తెలియజేశారు.
ఇది ప్రతి ఒక్కరి గెలుపు: Amit Shah
“వికసిత్ బిహార్ కోసం విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి గెలుపు ఇది. జంగల్‌రాజ్ లేదా ప్రలోభాలకు ఆధారమైన రాజకీయాలు మళ్లీ తిరిగి రావడం అసాధ్యం. ఎవరైనా ఎలాంటి వేషంలో వచ్చినా, ప్రజలు వారిని తిరస్కరిస్తారు” అని అన్నారు.
ప్రభుత్వంపై ప్రజల నమ్మకం: JP Nadda
“మోదీ-నీతీశ్ ప్రభుత్వాలు అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ విధానాలపై ప్రజలు చూపిన నమ్మకానికి ఈ ఫలితం స్పష్టమైన ఉదాహరణ. జంగల్‌రాజ్, అవినీతికి బిహార్ ఓటర్లు తుదితీర్పు చెప్పారు. ప్రజలు స్థిరత్వం, ఉత్తమ పాలన, అభివృద్ధికి మద్దతు తెలిపారు” అని జేపీ నడ్డా పేర్కొన్నారు.
Read Also: బీజేపీ డిపాజిట్ గల్లంతు.. ఈ పతనానికి కారణం ఏంటి?
Follow Us on: Instagram

