జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్.. కనీస పోటీ కూడా ఇవ్వలేదు. ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. తెలంగాణలో తమ పార్టీ బలహీనంగా ఉందని, కానీ ఉన్నంతలో గట్టిగా పోరాడామని చెప్పుకొచ్చారు. “జూబ్లీహిల్స్(Jubilee Hills)లో మేము స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఒక్క కార్పొరేటర్ కూడా గెలవలేదు. ఈసారి ప్రయత్నం చేసినప్పటికీ, ఎంఐఎం మద్దతు, భారీ డబ్బు కారణంగానే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఈ ఎన్నిక జరిగింది. మా పార్టీ అక్కడ బలహీనంగా ఉంది. ఓటమిని సమీక్షించుకుంటాం,” అని చెప్పారు.
ఆయన పేర్కొన్నారు, “ఓల్డ్ సిటీలో కూడా ఏ పార్టీ గెలవలేదని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రజల తీర్పును మేము గౌరవిస్తాం. ఎంఐఎం(MIM) సహకారం వల్లే కాంగ్రెస్ గెలిచిందని స్పష్టమైంది. రేవంత్ రెడ్డి ఏమి చేశాడో చూసి అనుకూలంగా ఓటేయాలని ప్రజలకు అడగటం జరుగుతోంది. రెండు పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు. దీనిపై మేము ఫిర్యాదు చేస్తాం. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై దృష్టి పెట్టాం. జీహెచ్‌ఎంసీ మేయర్ పదవి గెలుచుకోవడం మా లక్ష్యం. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక చోట్ల డిపాజిట్ కోల్పోయింది,” అన్నారు.
కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారు..
ఈ సందర్భంగానే ఆయన బీహార్(Bihar) ఎన్నికలపై కూడా స్పందించారు. బీహార్ ప్రజలు మళ్ళీ మోదీని నమ్మారని, దానికి బీహార్ ఎన్నికలు నిదర్శనమని అన్నారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వానికి బీహార్ ప్రజలు మళ్లీ విశ్వాసం చూపించారు. మేము ఊహించని భారీ విజయాన్ని ప్రజలు ఇచ్చారు. ఓటు చోరీపై కాంగ్రెస్ చేస్తున్న విష ప్రచారం ప్రజలచే తిరస్కరించబడింది. దేశమంతా ఎస్‌ఐఆర్ జరగాలి. జూబ్లీహిల్స్‌లో ఓటర్ జాబితా లోపాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ప్రజల దృష్టిలో రాహుల్ గాంధీ నవ్వుల పాత్రగా మారారు. ఈవీఎం హైజాక్ గురించి ఎప్పుడూ మాట్లాడే రాహుల్ గాంధీ, జూబ్లీహిల్స్ ఎన్నికలో ఎలా గెలిచాడు అనే ప్రశ్న ఏర్పడుతోంది” అని Kishan Reddy అన్నారు.
Read Also: జూబ్లీలో గెలిచింది నేనే: మాగంటి సునీత
Follow Us on : Pinterest

