కేరళ ఘటన.. ప్రధాని మోదీ దిగ్భాంతి

కలం, వెబ్ డెస్క్ : కేరళ (Kerala) త్రిశూర్ లోని బాణాసంచా కర్మాగారంలో జరిగిన పేలుడు ఘటన (Kerala Fire Blast)పై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడ్డవారికి రూ.50 వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేధికగా పోస్ట్ చేశారు.

అలాగే, కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాణాసంచా పేలుడు ఘటన (Kerala Fire Blast)తో తన గుండె పగిలినంత పని జరిగిందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. బాధిత కుటుంబాలకు మద్దతుగా ఉంటానని భరోసా కల్పించారు. గాయపడ్డవారికి ప్రభుత్వం సరైన వైద్య సహాయం చేయాలని రాహుల్ గాంధీ కోరారు. కాగా, బాణా సంచా పేలుడు ధాటికి మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఫైర్ సేఫ్టి బృందాలు, ఎమర్జెన్సీ టీమ్ సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Read Also: జీతాలు కట్ చేసిన సీఎం.. దేశంలోనే మొదటిసారి!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>