జనగణనలో తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దు: కరీంనగర్ కలెక్టర్

కలం, కరీంనగర్ బ్యూరో: జనగణన-2027లో (Census 2027) వివరాలను తప్పులు లేకుండా పారదర్శకంగా నమోదు చేయాలని కరీంనగర్ (Karimnagar) కలెక్టర్ చిత్రా మిశ్రా సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం చొప్పదండి బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు ఏర్పాటుచేసిన మొదటి విడత శిక్షణ కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ తప్పులు లేకుండా కుటుంబ సభ్యుల వివరాలను కచ్చితత్వంతో నమోదు చేయాలన్నారు. గత సర్వేల్లో పాల్గొన్న సిబ్బంది అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు గణన నిర్వహిస్తారని తెలిపారు.

రెండోదశ ఫిబ్రవరి 2027లో వ్యక్తులవారీగా సమాచారం సేకరిస్తారని పేర్కొన్నారు. అధికారులు ప్రతి కుటుంబం వివరాలు పక్కగా సేకరించాలని సూచించారు. సేకరించిన వివరాలు గోప్యంగా స్పష్టం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ.. నిబంధనలు పాటిస్తూ సర్వే పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నవీన్ కుమార్, శిక్షకులు పాల్గొన్నారు.

తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు

ఎండల కారణంగా గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం చొప్పదండి మండలం గుమ్లాపూర్, కాట్నపల్లి పంచాయతీ పరిధి మల్లన్నపల్లి గ్రామాల్లో ఉన్న మంచినీటి బావులను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆయా గ్రామాల్లో జనాభా అవసరాలకు అనుగుణంగా నీటిని అందించాలని సూచించారు. నీటి సమస్య తలెత్తకుండా చూడాలని, ఇందుకోసం మంజూరైన ప్రభుత్వ నిధులతో పెండింగ్ పనులు తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Read Also: ఏపీ టూరిజంపై నీతి ఆయోగ్ నివేదిక

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>