Mobile Popup Ad
Mobile Popup Ad

జీతాలు కట్ చేసిన సీఎం.. దేశంలోనే మొదటిసారి!

కలం, వెబ్ డెస్క్: హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం (Himachal Pradesh) సుఖ్వీందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల జీతాల్లో వచ్చే 6 నెలల పాటు అందించే వేతనాల్లో 30 శాతం కోత విధించబోతున్నట్లు ప్రకటించారు. అయితే, క్లాస్-3, క్లాస్-4 ఉద్యోగులను మాత్రం ఈ జీతాల కోత నుంచి మినహాయించారు. కాగా, దేశంలో ఇప్పటివరకు ఇలా జీతాల కోత విధించిన రాష్ట్రంగా హిమాచల్‌ప్రదేశ్ నిలవనుంది.

ఎందుకీ పరిస్థితి..

పర్వత ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలో ముందు నుంచి ఆదాయానికి, రాబడికి పొంతన లేకుండా ఉంటోంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు భారీగా పెరగడంతో అభివృద్ధికి నిధులు ఖర్చు పెట్టాలంటే నిరంతరం ఆర్థిక లోటు ఎదుర్కొంటోంది. దీనికి తోడు నిరంతరం ప్రకృతి విపత్తుల కారణంగా.. ఆయా ప్రాంతాల పునర్నిర్మాణానికే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. 2023లో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరైన పర్యాటకం కొవిడ్ కారణంగా దెబ్బతిన్నది. అప్పుల భారం, ఖజానా ఖాళీ కావడం, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల రాక తగ్గడం, పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేయడంతో ఆర్థిక భారం మరింత పెరిగింది. 2025లో రాష్ట్ర బడ్జెట్ రూ.58,514 కోట్లు కాగా, 2026లో బడ్జెట్ రూ.58,514 కోట్లుగా ఉంది. ఇలా, బడ్జెట్ తగ్గించిన తొలి రాష్ట్రం కూడా హిమాచల్ ప్రదేశ్ కావడం గమనార్హం.

Read Also: భూ హక్కులకు శాశ్వత భరోసా : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>