కలం, వెబ్ డెస్క్ : పీఎఫ్ (EPFO) ఉన్న ఉద్యోగులకు అనేక రకాల ప్రభుత్వ ప్రయోజనాలు ఉంటాయి. అందులో ఉచితంగా వర్తించే రూ.7 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ (Life Insurance) స్కీమ్ గురించి ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాలి. దీని పేరు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్. ఈపీఎఫ్ వో సంస్థ దీన్ని అందిస్తుంది. మీరు ఏదైనా కంపెనీలో పీఎఫ్ పొందితే వెంటనే ఇది మీ పీఎఫ్ ఖాతాకు ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతుంది. ఒకవేళ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి ఈ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఈ స్కీమ్ కోసం ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పనిలేదు. ఉచితంగానే ఈపీఎఫ్ వో సంస్థ మీకు అందిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ కోసం ఎలాంటి మెడికల్ చెకప్ లు కూడా అవసరం లేదు. ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన పనికూడా లేదు.
ఈ లైఫ్ ఇన్సూరెన్స్ (Life Insurance) కు సంబంధించిన ప్రీమియం డబ్బులను ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీనే భరిస్తుంది. ఉద్యోగి మరణించిన సమయంలో రూ.2.5 లక్షల నుంచి రూ.7 లక్షల దాకా ఇన్సూరెన్స్ కింద డబ్బులు వస్తాయి. ఉద్యోగి నెల జీతం, పీఎఫ్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ఆధారంగా నిర్ణయించి బీమా మొత్తాన్ని కుటుంబానికి అందిజేస్తారు. కాకపోతే ఉద్యోగి చనిపోయే సమయంలో ఆ ఫీఎఫ్ అకౌంట్ కచ్చితంగా యాక్టివ్ లో ఉండాలి. లేదంటే ఇన్సూరెన్స్ కు అనర్హుడిగా గుర్తిస్తారు.
ఎలా క్లెయిమ్ చేసుకోవాలి..?
ఈడీఐఎల్ (EDIL) డబ్బుల కోసం ఉద్యోగి నామినీ Form 15 IF ను నింపి సదరు కంపెనీ ద్వారా ఈపీఎఫ్ కమిషనర్ కు అందజేయాలి. ఒకవేళ నామినీ మైనర్లు అయితే.. వారి తరఫున ఇంకెవరైనా దీన్ని పూర్తి చేయొచ్చు. ఆన్ లైన్ లో చేయాలనుకుంటే.. ఈపీఎఫ్ వో వెబ్ సైట్ లోనే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన 20 రోజుల్లోపు ఇన్సూరెన్స్ డబ్బులు సదరు నామినీ ఖాతాలో పడిపోతాయి.
Read Also: ‘సాయ్’ హాస్టల్లో ఇద్దరమ్మాయిల అనుమానాస్పద మృతి
Follow Us On: X(Twitter)


