కలం, వెబ్‌డెస్క్: టీవీకే చీఫ్, నటుడు విజయ్ నటించిన జన్ నాయగన్ మూవీ చుట్టూ వివాదాలు ముసురుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ నిరాకరించడంతో వివాదం కోర్టుకు చేరింది. అయితే, ఇదే క్రమంలో మరో గొడవ స్టార్ట్ అయ్యింది. అది విజయ్, శివకార్తికేయన్ (Sivakarthikeyan ) అభిమానుల మధ్య మొదలైంది. ఈ క్రమంలో వివాదంపై శివకార్తికేయన్ స్పందించారు. విజయ్ (Vijay Actor)తనకు సోదరుడి లాంటి వాడని, తమ మధ్య గొడవలేవీ లేవని అన్నారు. ఆయన సినిమాలను తాను అభిమానిస్తానని, రాజకీయంగానూ విజయ్‌కు మద్దతిచ్చానని శివకార్తికేయన్ స్పష్టం చేశారు.
వివాదం ఎందుకంటే..
జన నాయగన్ (Jan Nayagan) విడుదల సమయంలోనే శివ కార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి కూడా రిలీజ్‌కు సిద్ధమైంది. 1960 దశకంలో తమిళనాడులో చెలరేగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా తీశారు. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ 25 కట్లు చెప్పి, అనంతరం యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వడంతో, అనుకున్న సమయానికే రిలీజ్ అయ్యింది. ఇది కాస్తా విజయ్, శివకార్తికేయన్ (Sivakarthikeyan) అభిమానుల మధ్య వివాదం రాజేసింది.
జన నాయగన్ విడుదలను అడ్డుకోవడం, అదే సమయంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీసిన పరాశక్తి సినిమా రిలీజ్ కావడంతో విజయ్ అభిమానులు శివకార్తికేయన్‌పై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఇద్దరు హీరోల అభిమానులు కామెంట్స్, మీమ్స్‌తో తలపడ్డారు. దీనికి మరింత నిప్పు రాజేస్తూ ఢిల్లీలో కేంద్ర మంత్రి మురుగన్ ఇంట్లో జరిగిన పొంగల్ వేడుకలకు శివ కార్తికేయన్, పరాశక్తి (Parasakthi) నిర్మాతలు, దర్శకుడు హాజరవడం తమిళనాట జన నాయగన్ వర్సెస్ పరాశక్తిగా మారింది.
అయితే, దీనిపై పొంగల్ వేడుకల్లోనే శివకార్తికేయన్ క్లారిటీ ఇచ్చారు. తనకు విజయ్ సోదరుడు లాంటివారని, ఈ బంధం తమ మధ్య ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎవరో కొద్ది మంది అభిమానులు మాత్రమే మాట్లాడే మాటల్ని జనరలైజ్ చేయవద్దని కోరారు. ఈ సమాధానంతో అయినా విజయ్ అభిమానులు శాంతిస్తారో లేదో చూడాలి. మరోవైపు పరాశక్తి సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. ఈ మూవీకి తమిళనాడులో మిశ్రమ స్పందన వస్తోంది.
Read Also: ‘జన నాయగన్’కు షాకిచ్చిన సుప్రీంకోర్ట్!
Follow Us On: Instagram


