epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

టూ వీలర్ ప్రమాదాల్లో 3.35లక్షల మంది మృతి : గడ్కరీ

కలం, వెబ్​డెస్క్​: దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నవాళ్లలో టూ వీలర్ యాక్సిడెంట్ల (Two Wheeler Accidents) వాటా ఎక్కువ ఉంటోందని కేంద్ర రోడ్లు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ (Nitin Gadkari) పేర్కొన్నారు. మినిస్ట్రీ ఆఫ్​ రోడ్ ట్రాన్స్​పోర్ట్​ అండ్​ హైవేస్​ నివేదికను ఉటంకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రమాదాల నివారణకు కేంద్రం కృషి చేస్తోందని ఆయన అన్నారు.కాగా, కేంద్ర రోడ్లు రవాణా, నేషనల్​ హైవేస్​ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం  2019–23 మధ్య దేశవ్యాప్తం జరిగిన రోడ్లు ప్రమాదాల్లో టూ వీలర్​ యాక్సిడెంట్ల వలన 3.35లక్షల మందికిపైగా చనిపోయారు. ఇది ఆ ఐదేళ్ల కాలంలో జరిగిన మొత్తం 7.78లక్షల మరణాల్లో 40శాతం పైగా ఉంది.ఈ  డేటా ప్రకారం కేవలం 2023 ఏడాదిలో జరిగిన టూ వీలర్​యాక్సిడెంట్ల వల్ల మాత్రమే 77,539 మంది మరణించారు. ఇది ఆ ఏడాది జరిగిన ప్రమాద మృతుల్లో 45శాతం ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

దేశవ్యాప్తంగా పట్టణాలు, పల్లెల్లో రవాణా, ఇంటి పనుల్లో ద్వి చక్ర వాహనాలు కీలకం. అందువల్లే ఏటా జరుగుతున్న ప్రమాదాల్లో టూ వీలర్ల (Two Wheeler Accidents) వాటా భారీగా ఉంటోంది. దీనిని నివారించడానికి కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు రోడ్లు, రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు వెంటనే చేయడం, ట్రాఫిక్​ రూల్స్​ను (Traffic Rules) కఠినంగా అమలు చేయడం, పాఠశాలలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వంటివి చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే, ఎన్ని చేసినా ప్రమాదాల నివారణలో మన వంతు బాధ్యత తప్పకుండా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read Also: హైదరాబాద్‌కు సదరన్ కమాండ్‌: సీఎం విజ్ఞప్తి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>