epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘సాయ్’​ హాస్టల్​లో ఇద్దరమ్మాయిల అనుమానాస్పద మృతి

కలం, వెబ్​డెస్క్​: స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(SAI​) ట్రైనింగ్​ సెంటర్​లో ఇద్దరమ్మాయిలు అనుమానాస్పద స్థితిలో మృతి (Girls Found Dead) చెందారు. ఈ సంఘటన బుధవారం కేరళలోని (Kerala) కొల్లాంలో ఉన్న సాయ్​ హాస్టల్​లో బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అమ్మాయిలు ఉదయం ట్రైనింగ్​కు రాకపోవడం, ఫోన్​ కాల్​కు స్పందించకపోవడంతో కోచ్​లు, ఇతర క్రీడాకారిణిలకు అనుమానం వచ్చింది. వెంటనే వాళ్లు హాస్టల్​కు వచ్చి పరిశీలించారు. అమ్మాయిలు ఉన్న గది తలుపులను బలవంతంగా తెరచి లోపలికి ప్రవేశించారు. అక్కడ ఇద్దరమ్మాయిలూ సీలింగ్ ఫ్యాన్​కు ఉరివేసుకొని కనిపించారు. వెంటనే వాళ్లను కిందకి దించి పరిశీలించగా, అప్పటికే  చనిపోయినట్లు గుర్తించారు.

ఇద్దరమ్మాయిల్లో ఒకరు కోలిక్కోడ్​కు చెందిన సాండ్రా (17), మరొకరు తిరువనంతపురానికి చెందిన  వైష్ణవి (15). ఇంటర్మీడియెట్​ చదువుతున్న సాండ్రా .. అథ్లెటిక్స్​లో శిక్షణ పొందుతోంది. వైష్ణవి కబడ్డీలో ట్రైనింగ్​ తీసుకుంటోంది. హాస్టల్​లో ఇద్దరివీ వేర్వేరు గదులు. అయితే, మంగళవారం వీళ్లు ఒకే గదిలో నిద్రించారు. వీరి మృతికి (Girls Found Dead) కారణాలు తెలియరాలేదు. గదిలో ఎలాంటి లేఖ లభించలేదు. వీళ్లది హత్యా? లేక ఆత్మహత్యా అనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ సంఘటన కేరళలో కలకలం సృష్టిస్తోంది.

Read Also: నేను విజయ్‌కి పెద్ద ఫ్యాన్ : అన్నామలై

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>