కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిర్వహించిన మీడియా సమావేశంపై వైసీపీ కీలక నేత పేర్ని నాని (Perni Nani) స్పందించారు. సింపతీ పొందేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా పవన్ కళ్యాణ్ డ్రామా అని వ్యాఖ్యానించారు. తమ సంఘం (కాపు) అంతా దూరం అవుతుందని గ్రహించిన పవన్ కళ్యాణ్.. తెలంగాణ వాళ్లతో తిట్టించుకుని సానుభూతితో ఓట్లు అడుగుతామని సరికొత్త ప్లాన్ చేశాడని విమర్శించారు.
అయితే ప్రజలకు అన్నీ తెలుసునని.. పవన్ కళ్యాణ్ ను నమ్మరని పేర్ని నాని (Perni Nani) చెప్పారు. అయిన తల్లికి గూడు పెట్టలేనోడు పెద్దమ్మకు వడ్డానం కొంటాడట అని ఎద్దేవా చేశారు. ఏపీలో హామీలను పట్టించుకోని పవన్ కళ్యాణ్.. తెలంగాణ వెళ్లి ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తారట అని విమర్శించారు. హైదరాబాద్ లో సభకు అనుమతి ఇవ్వకపోతే సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. పవన్ కళ్యాణ్ తన డ్రామాలను పక్కనపెట్టాలని సూచించారు.
Read Also: దేవీపట్నంలో పెద్దపులి కలకలం.. 14 దూడలు బలి!
Follow Us On : WhatsApp

