కేంద్రంతో చర్చ.. సీజేపీ ప్రధాన డిమాండ్లు ఇవే..!

కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలో ఉద్రిక్తతల నడుమ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిశారు. ఈ సమావేశంలో డిమాండ్ల (CJP Demands)తో కూడిన లెటర్ ను కేంద్రమంత్రికి అందజేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీ నామా సహా, నీట్ ఎగ్జామ్ రద్దు కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం, సోనమ్ వాంగ్ చుక్ విడుదల చేయాలనే డిమాండ్లను జేపీ నడ్డా ముందు ఉంచారు.

కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం మీడియాతో సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడారు. జేపీ నడ్డా (JP Nadda)ను కలిసి 10 నిమిషాల పాటు చర్చించినట్లు తెలిపారు. తమ డిమాండ్లతో కూడిన లేఖను ఆయనకు అందజేశామన్నారు. తమ డిమాండ్లలో (CJP Demands) ప్రధానంగా సోనమ్ వాంగ్ చుక్ విడుదల, నీట్ పరీక్షల రద్దు కారణంగా చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయాల చొప్పున పరిహారం, నీట్ పరీక్ష లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వినతి పత్రంలో కోరినట్లు సౌరవ్ దాస్ (Saurav Das) వెల్లడించారు. తమ డిమాండ్ల లేఖపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి ఎలాంటి హామీ ఇవ్వలేదని చెప్పారు. ప్రభుత్వంలో అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని జేపీ నడ్డా చెప్పారని సీజేపీ ప్రతినిధి తెలిపారు.

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ పై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ గత కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలియజేస్తోంది. ఈ క్రమంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశం తొలిరోజున సీజేపీ పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రమంత్రి జేపీ నడ్డా తన నివాసంలో సమావేశం అయి చర్చలు జరిపారు.

ఆందోళన విరమించుకోవాలి

సీజేపీ ప్రతినిధులతో భేటీ అనంతరం కేంద్రమంత్రి జేపీ నడ్డా స్పందించారు. కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళన విరమించుకోవాలని ఆయన కోరారు. ఈ ఉదయం, తొలిసారిగా ప్రభుత్వంతో చర్చలు జరపాలని నిరసనకారుల నుంచి ఒక ప్రతిపాదన వచ్చినట్లు తెలిపారు. ఉదయం 11:50 గంటల నుంచి చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. సీజేపీ ప్రతినిధి బృందంతో ప్రాథమికంగా మౌఖిక చర్చలు జరిగాయని.. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తను లిఖితపూర్వక వినతిపత్రాన్ని సమర్పించినట్లు జేపీ నడ్డా తెలిపారు. ఈ సందర్భంగా నిరసనకారులందరూ తమ ధర్నాను విరమించి, సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడంలో సహకరించాలని ప్రతినిధులను కోరినట్లు నడ్డా వెల్లడించారు.

Read Also: ప్రమాదంలో కోట్లాది యువత.. WHO సంచలన రిపోర్ట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>