కలం, వెబ్ డెస్క్: ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) నిరాహార దీక్షను విరమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నీట్ పేపర్ లీకేజీ, రద్దు నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో జూన్ 28 నుంచి నిరాహార దీక్ష ప్రారంభించారు. కేవలం నీరు మాత్రమే తాగుతూ దీక్ష చేస్తుండటంతో ఆరోగ్యం క్షీణించసాగింది.
మూడు డిమాండ్లు పెట్టిన వాంగ్‌చుక్..
తాను నిరాహార దీక్ష విరమించాలంటే మూడు డిమాండ్లు నెరవేర్చాలని సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) ఉదయం పేర్కొన్నారు. పేపర్ లీకేజీకి కేంద్రం బాధ్యత వహించడం, పార్లమెంటులో తాము లేవనెత్తుతున్న సమస్యలపై చర్చించడం, ఎంపీలు స్వయంగా ఆసుపత్రికి వచ్చి హామీలపై మాట్లాడుతామని భరోసానివ్వాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ హైకోర్ట్ జోక్యంతో..
సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యంపై మూడు రోజుల కిందటే ఆందోళన వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్ట్.. ప్రతి పౌరుడి భద్రత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ఆయన్ను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అదే సమయంలో, ఆయన నిర్ణయానికి విరుద్ధంగా ఆహార పదార్థాలు ఇవ్వొద్దని కూడా సూచించింది. దీంతో, పోలీసులు ఆయన్ను బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ సైతం దీక్షను కొనసాగిస్తూ వస్తున్నారు.
Read Also: ప్రమాదంలో కోట్లాది యువత.. WHO సంచలన రిపోర్ట్
Follow Us On: Instagram

