కలం, సినిమా : ఏపీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన భారీ చిత్రం ‘పెద్ది'(Peddi) బాక్సాఫీస్ వద్ద రిలీజ్‌కు ముందే సంచలనం సృష్టిస్తోంది. సినిమాపై ఉన్న హైప్ కారణంగా టికెట్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ‘పుష్ప-2’ రేంజ్‌లో టికెట్ రేట్లు పెరిగిపోవడంతో అభిమానులలో సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. ప్రీమియర్ షోలకు ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ.1000 వరకు చేరగా, గురువారం ఉదయం 7 గంటల స్పెషల్ షో టికెట్లు రూ.500కి విక్రయిస్తున్నారు. ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ టికెట్లు క్షణాలలో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
ఆన్‌లైన్ బుకింగ్స్‌తో పాటు థియేటర్ల వద్ద కూడా అభిమానులు భారీగా క్యూ కడుతున్నారు. ఏపీ వ్యాప్తంగా థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ‘పెద్ది’ మేనియాతో సినిమా హాళ్లు కళకళలాడుతున్నాయి. రామ్ చరణ్ – బుచ్చిబాబు సనా కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజా బుకింగ్స్ ట్రెండ్ ఆ అంచనాలను మరింత పెంచుతోంది. అభిమానులు సినిమాను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

