’35 చిన్న కథ కాదు’ మూవీ అరుదైన ఘనత

కలం, సినిమా : తెలుగు సినీ పరిశ్రమకు మరో అరుదైన గౌరవం దక్కింది. జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ బాలల చిత్రం విభాగంలో ఎంపికైన తెలుగు చిత్రాల జాబితాలో తాజాగా ‘35 చిన్న కథ కాదు’(35 Chinna Katha Kaadu) (2024) చోటు దక్కించుకుంది. ఈ విజయంతో ఈ విభాగంలో జాతీయ అవార్డు అందుకున్న రెండో తెలుగు చిత్రంగా ‘35 చిన్న కథ కాదు’ నిలిచింది. అంతకుముందు 1997లో విడుదలైన ‘బాల రామాయణం’(Bala Ramayanam) ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.

దాదాపు 27 ఏళ్ల తర్వాత అదే విభాగంలో మరో తెలుగు చిత్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషం. బాలల మనస్తత్వం, కుటుంబ విలువలు, హృద్యమైన కథనంతో రూపొందిన ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu) ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ తాజా అవార్డుతో తెలుగు సినిమాకు మరోసారి జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించగా, చిత్రబృందానికి సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read Also: ‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్ సరసన క్రేజీ హీరోయిన్?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>