కలం వెబ్ డెస్క్ : తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల(MLAs) అనర్హతపై బుధవారం స్పీకర్ కీలక తీర్పునివ్వనున్నారు. పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులు అందగా, ప్రస్తుతం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఐదుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు (Speaker Verdict) ఇవ్వనున్నారు. ఈ మేరకు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డిల అడ్వకేట్లకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు పంపించారు.
నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు బీఆర్ఎస్(BRS), ఫిరాయింపు ఎమ్మెల్యేల అడ్వకేట్లు స్పీకర్ కార్యాలయానికి రానున్నారు. అనంతరం ఆయా అనర్హత (Disqualification) పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఆయా పిటిషన్లపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు గత నెల 17న స్పీకర్‌కు గడువు విధించిన సంగతి తెలిసిందే. గురువారంతో గడువు ముగుస్తున్నందున నేడు తుది తీర్పు ప్రకటించేందుకు స్పీకర్ సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఎలాంటి తీర్పు(Speaker Verdict) వెలువడుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Read Also: పోలింగ్ కేంద్రం దగ్గర కుర్చీ వేసుకొని కూర్చున్న ఎమ్మెల్యే
Follow Us On: Pinterest


