epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అకిరా ఎంట్రీ ఎప్పుడు..? ఎవరితో..?

కలం డెస్క్: పవర్ స్టార్ వారసుడు అకిరా నందన్(Akira Nandan).. ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. అఫిషియల్ గా ఎలాంటి అప్ డేట్ లేదు. అకిరా నందన్ కు సంబంధించిన ఏ చిన్న ఫోటో బయటకు వచ్చినా.. వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. దీనిని బట్టి ఎంత క్రేజ్ ఉందో.. అతని రాక కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అకిరా ఎంట్రీ గురించి ఓ న్యూస్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఏంటా న్యూస్..? పవర్ స్టార్ వారసుడు ఎంట్రీ ఎప్పుడు..? ఫస్ట్ మూవీ ఎవరితో..?

అకిరా నందన్(Akira Nandan).. పవర్ స్టార్ వారసుడు కాబట్టి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తాడు అనుకుంటే.. మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ చూపించేవాడు. టెక్నికల్ విషయాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించడంతో నటన పై ఆసక్తి ఉందా..? లేదా..? అసలు అకిరా ఎంట్రీ ఉంటుందా..? ఉండదా..? అనే మాట వినిపించేది. ఇదే విషయం గురించి రేణుదేశాయ్(Renu Desai) ని అడిగితే.. అకిరా హీరోగా నటిస్తానంటే.. అందరి కంటే ముందుగా ఆనందించేది తనేనని.. కాకపోతే అకిరా ఇష్టమే తన ఇష్టమని.. ఈ విషయంలో అతన్ని ఫోర్స్ చేయనని చెప్పారు. అయితే.. పవన్(Pawan Kalyan) బయటకు వెళితే అకిరాను తీసుకెళ్లడం.. సినీ, రాజకీయ ప్రముఖులకు పరిచయం చేయడం.. ఆమధ్య సినిమాలు చూడడం కోసం అకిరా థియేటర్స్ కు వెళ్లడం.. అభిమానులను కలవడం.. ఇదంతా చూసి అకిరా సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని టాక్ వినిపించింది.

తాజా సమాచారం ప్రకారం.. అకిరా యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడని.. తెర వెనుక అకిరా ఎంట్రీకి సంబంధించిన వర్క్ జరుగుతుందని తెలిసింది. అకిరాతో సినిమాని నిర్మించేందుకు బడా నిర్మాతలు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ని కాంటాక్ట్ చేసినట్టు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ కు పవన్ కళ్యాణ్‌ తో మంచి అనుబంధం ఉంది. అకిరాని హీరోగా పరిచయం చేసే ఛాన్స్ ఇవ్వమని అడిగినట్టుగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ తో మంచి అనుబంధం ఉన్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్ కూడా అకిరాతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు ఆరంభించినట్టు వార్తలు వస్తున్నాయి.

నిర్మాణ సంస్థ ఓకే. మరి.. ఎవరి దర్శకత్వంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. అకిరాను హీరోగా పరిచయం చేసే దర్శకుల పేర్లలో ముందుగా వినిపిస్తున్న పేరు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు, మిత్రుడు అయిన త్రివిక్రమ్ ని సంప్రదించకుండా పవన్ ఏ నిర్ణయం తీసుకోరు. అకిరా విషయంలో పూర్తిగా త్రివిక్రమ్ సలహా మేరకే సినిమా ఎవరితో చేయాలనేది డిసైడ్ చేస్తారు. త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో ఆనంద నిలయం మూవీ చేస్తున్నారు. ఆతర్వాత ఎన్టీఆర్ తో భారీ మైథలాజికల్ మూవీ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో అకిరాతో సినిమా ఉండచ్చు. ఒకవేళ అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఈలోపు లోనే అకిరాను పరిచయం చేయాలి అనుకుంటే.. త్రివిక్రమ్ సలహా, సూచనలతోనే వేరే డైరెక్టర్ తో సినిమా ఉండచ్చు. ఏది ఏమైనా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Read Also: విదేశీ ఆటగాళ్లపై బీసీసీఐ కొత్త క్యాప్ రూల్.. అసలదేంటంటే..!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>