కలం, వెబ్ డెస్క్ : భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ట్రాఫిక్ చలాన్ల (Traffic Challans) మీద పెద్ద చర్చ జరుగుతోంది. 2022, 23, 24 సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ చలాన్ల వివరాలను కేంద్ర రవాణాశాఖ వెల్లడించింది. గత మూడేళ్లకు సంబంధించి దేశవ్యాప్తంగా రూ.21వేల కోట్ల ట్రాఫిక్ చలాన్లు ఇంకా పెండింగ్ లోనే ఉండటం షాకింగ్ గా మారింది. వసూలు చేసిన అమౌంట్ కంటే పెండింగ్ అమౌంట్ ఎక్కువగా ఉంది. ఇన్ని వేల కోట్ల చలాన్లు ఇంకా పెండింగ్ లోనే ఉండటంతో.. వీటిగురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
ఇయర్ వైజ్ గా చూస్తే.. 2022లో 4 కోట్ల 76లక్షల 43 వేల 688 ట్రాఫిక్ చలాన్లు(Traffic Challans) వేశారు పోలీసులు. ఈ చలాన్లలో రూ.3,629,19,78,281 కోట్లు వసూలు చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఇంకా రూ.3668వేల కోట్లకు పైగా పెండింగ్ లోనే ఉంది. 2023లో 6 కోట్ల 79 లక్షల 12082 చలాన్లు వేశారు. ఇందులో సుమారు రూ.4150 వేల కోట్లకు పైగా అమౌంట్ చెల్లించారు వాహనదారులు. ఇంకా రూ.6,654 వేల కోట్ల అమౌంట్ పెండింగ్ లో ఉంది. 2024లో 8 కోట్ల 18 లక్షల 91 వేల 326 చలాన్లు వేశారు పోలీసులు. ఈ చలాన్లకు సంబంధించి రూ.3,834 వేల కోట్లకు పైగా చెల్లించారు. ఇంకా రూ.9097 వేల కోట్ల అమౌంట్ పెండింగ్ లోనే ఉంది.
90 రోజులు దాటితే..!
కేంద్ర మోటార్ వాహన చట్టం ప్రకారం 90 రోజులు దాటిన తర్వాత కోర్టు కేసులు ఉంటే తప్ప చలాన్లు వసూలు చేయడం కుదరదు. ఈ లెక్కన మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న వేల కోట్ల చలాన్లు ఇంక వసూలు కానట్టే అంటున్నారు నెటిజన్లు. ఈ పెండింగ్ చలాన్లలో సగానికి పైగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఈ 2024లోనే ఎక్కువగా చలాన్లు పెండింగ్ లో పడ్డాయి.
పెరుగుతున్న ‘ట్రాఫిక్’ ఉల్లంఘనలు
గత మూడేళ్లు చూసుకుంటే ప్రతి ఏడాది చలాన్లు పెరుగుతూనే ఉన్నాయి. పెండింగ్ అమౌంట్ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. అంటే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వాళ్ల సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. కేంద్ర రవాణాశాఖ, ట్రాఫిక్ పోలీసులు చలాన్లను పెండింగ్ లో ఉంచుకుండా వసూలు చేస్తే అప్పుడు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం ఇండియాలో తగ్గిపోతుందని అంటున్నారు నెటిజన్లు.
Read Also: ‘బీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టేది హరీశే’: పీసీసీ చీఫ్
Follow Us On: X(Twitter)


