epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మాట్లాడుతుండగానే హార్ట్ ఎటాక్.. కాపాడిన వ్యాపారి కొడుకు

కలం డెస్క్: ఈ రోజుల్లో హార్ట్ ఎటాక్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. తాజాగా కోటా రాంపురా మార్కెట్ లో ఓ వ్యక్తిని కాపాడిన తీరుపై ప్రశంసలు వస్తున్నాయి. కోటా రాంపురా మార్కెట్(Kota Rampura Market) కు జైపూర్ నుంచి ఓ జెమ్ స్టోన్ ట్రేడర్ వచ్చాడు. అతను బంగారం షాపులో మాట్లాడుతుండగానే కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన షాపు యజమాని కొడుకు అలర్ట్ అయి రెండున్నర నిముషాలు కంటిన్యూగా సీపీఆర్ చేశాడు. దాంతో ట్రేడర్ సాధారణ స్థితికి వచ్చాడు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు కోటా రాంపురా వ్యాపారి కొడుకును అభినందిస్తున్నారు.

Read Also: బాలికకు డ్రగ్స్ ఇచ్చి.. ప్రైవేట్ వీడియోలు తీసి..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>