epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘బీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టేది హరీశే’: పీసీసీ చీఫ్

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Goud) విమర్శించారు. ఓ వైపు కవిత విమర్శలు, మరోవైపు కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు రాకపోవడం వంటి సమస్యలతో ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోందని పేర్కొన్నారు. ఏదో ఒక రోజు ఆ పార్టీని హరీశ్ రావు దెబ్బకొడతారని పేర్కొన్నారు. కవిత బయటకొచ్చినట్టే హరీశ్ రావు కూడా బయటకు వస్తారని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి

కవిత(Kavitha) విమర్శలతో బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోందని మహేశ్ గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ ఎప్పటికీ అధికారంలోకి రాలేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాను మేనేజ్ చేస్తూ కేటీఆర్(KTR) నెట్టుకొస్తున్నారని విమర్శించారు. కవిత చేస్తున్న ఆరోపణలను ప్రజలు కూడా నమ్ముతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ ఉంటే కవిత ఆ పార్టీని విడిచిపెట్టి వచ్చేది కాదన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ ఫ్యూచర్ సిటీ(Bharat Future City) డెవలప్ అయితే ఏ రాష్ట్రం తెలంగాణతో పోటీ పడలేదని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసలు సంక్షేమ పథకాలే అమలు కావడం లేదని విమర్శించారు.

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 10 కిలోల దొడ్డు బియ్యం పేదలకు పంచుతుంటే.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. అధికారంలో లేని ప్రాంతీయ పార్టీలు మనుగడ సాధించడం కష్టమని చెప్పారు. కాంగ్రెస్ పాలనా పట్ల తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తెలంగాణలో సునాయాసంగా అధికారంలోకి వస్తామని చెప్పారు. తెలంగాణలో ఇచ్చినన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు.

అత్యాశ ఉండొద్దు

‘సీఎం కావాలనే ఆశ అందరికి ఉంటుంది. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు. ’ అంటూ కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌(KCR)కు ఉన్న ఇమేజ్ ఆ కుటుంబంలో ఎవరికి రాలేదని పేర్కొన్నారు. చంద్రబాబు ఎంత కిందా మీదా పడ్డా పెట్టుబడిదారులు హైదరాబాద్‌కే వస్తున్నారన్నారు. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన సర్ ప్రక్రియతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మహేశ్(Mahesh Goud) ఆరోపించారు.

Read Also: విజన్ సరే… ఇంప్లిమెంటేషన్ ఎలా?

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>