కలం డెస్క్ : Panchayat Bodies Meeting | రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల పోస్టులకు ఎన్నికలు ఈ నెల 17న పూర్తవుతున్నందున 20వ తేదీన తొలి సమావేశం జరగనున్నది. అదే సమావేశంలో కొత్త సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరుగుతుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు (Collectors), పంచాయతీరాజ్ అధికారులు (District Panchayat Officers), మండల పరిషత్ డెవలప్2మెంట్ ఆఫీసర్లు (MPDO), పంచాయతీ సెక్రటరీలకు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు మినహా అన్ని జిల్లాలకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.
దాదాపు ఏడాదిన్నర కాలంగా అధికారుల పాలనలో ఉన్న గ్రామ పంచాయతీలు ఇప్పుడు ఎన్నికల ప్రజా ప్రతినిధులతో కొలువుదీరనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 17728 పంచాయతీల సర్పంచ్ పోస్టులకు, 1.12 లక్షల వార్డుల సభ్యుల పోస్టులకు డిసెంబరు 11, 14 తేదీల్లో తొలి రెండు దశల పోలింగ్ కంప్లీట్ కాగా 17న థర్డ్ ఫేజ్ పోలింగ్ జరగనున్నది. ఇది కూడా పూర్తయిన తర్వాత తొలి సమావేశం(Panchayat Bodies Meeting) జరగనున్నది. ఇందులో కొత్తగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టనున్నారు.
Read Also: విజన్ సరే… ఇంప్లిమెంటేషన్ ఎలా?
Follow Us On: X(Twitter)


